సత్యసాయి జిల్లా ట్రూ టైమ్స్ ఇండియా డిసెంబర్ 4: ధర్మవరం నుంచి చెన్నేకొత్తపల్లికి బస్సులో ప్రయాణిస్తుండగా తనపై ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని, దాడి చేశాడంటూ ఫిర్యాదు చేసిన ఇంటర్ విద్యార్థిని స్పందన చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
కుటుంబ సభ్యులు మరియు బాలిక తండ్రి కన్నీరుమున్నీరై, పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ఘటన వివరాలు:
స్పందన అనే విద్యార్థినిపై వంశీకృష్ణ అనే యువకుడు దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై స్పందన పోలీసులను ఆశ్రయించినా, నిందితుడిపై సకాలంలో కఠిన చర్యలు తీసుకోకపోవడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదన్న మనస్తాపంతో స్పందన వారం రోజుల క్రితం ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
తల్లిదండ్రుల ఆవేదన:
“ఓ పోలీస్ అన్న... ఆ తండ్రీ ఆవేధన చూడు అన్న," అంటూ స్పందన తల్లిదండ్రులు రోదిస్తున్నారు. పోలీసుల అలసత్వం కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని వారు వాపోతున్నారు.
దర్యాప్తుకు డిమాండ్:
ఈ ఘటనపై సత్యసాయి జిల్లా ఎస్పీ గారు పూర్తి దర్యాప్తు జరిపించి, తమకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ వేడుకుంటున్నారు.


Comments
Post a Comment