ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా డిసెంబర్ 2:
రాష్ట్ర ఆర్థిక, మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ మంగళవారం ఉరవకొండ పట్టణంలో పర్యటించారు.
కనేకల్లు క్రాస్ నుండి గుంతకల్లు రోడ్డు వరకు నిర్మాణంలో ఉన్న బైపాస్ రోడ్డు పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనుల పురోగతి, నాణ్యతా ప్రమాణాలను గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

Comments
Post a Comment