కైశిక ఏకాదశి సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి తితిదే చైర్మన్ గారు సతీసమేతంగా నేడు టిటిడి తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ శ్రీ పి. శివరామన్ గారు, ప్రధానార్చకులు శ్రీ సుందరభట్టర్ గారు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
పట్టువస్త్రాలను ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించాము. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
2006 నుంచి ప్రాచీన శ్రీ వైష్ణవ క్షేత్రాలతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని కొనసాగిస్తూ టిటిడి తరఫున శ్రీరంగానికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ నరేష్ కుమార్ గారు, అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు.

Comments
Post a Comment