హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలపై సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకూడదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆయన సూచించారు. “తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వకండి. ఇవి లీగల్‌గా చెల్లుబాటయ్యే ఎన్నికలు కావని జాగ్రత్తగా ఉండాలి. కోర్టు రాజ్యాంగబద్ధంగా లేవని కొట్టేస్తే పరిస్థితి ఏమవుతుంది? మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు రద్దు చేసింది. అప్పట్లో పోటీదారులు భారీగా నష్టపోయారు” అని ఈటెల గుర్తుచేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర తరహాలో ఇక్కడా ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన హెచ్చరించారు. అభ్యర్థులు హడావుడిగా ఖర్చు చేయకుండా పరిస్థితి స్పష్టంగా తెలిసే వరకు ఆగాలని ఈటెల పిలుపునిచ్చారు.
Local to international