కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుతుందా విశాఖపట్నం జిల్లా పరిధిలోని గోపాలపట్నం – నరవ కొండ పరిసర ప్రాంతాలు గత 16 నెలలుగా మైనింగ్ మాఫియా బీభత్సానికి గురవుతున్నాయి. చట్టపరమైన అనుమతులు లేకుండా రాత్రివేళల్లో భారీ యంత్రాలతో కొండలను తవ్వి, ట్రక్కుల ద్వారా రాళ్లను తరలిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సంపదను దోచుకుంటున్న ఈ అక్రమ తవ్వకాలపై అధికారులు, పర్యావరణ శాఖ, పోలీసు విభాగం మౌనం పాటించడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కొండల తవ్వకాల కారణంగా చుట్టుపక్కల గ్రామాల భూగర్భ జలాలు తగ్గిపోగా, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. “అక్రమ తవ్వకాలపై ప్రత్యేక దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి,” అని గోపాలపట్నం, నరవ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా ప్రజలు ఈ మైనింగ్ మాఫియాపై ప్రభుత్వం ఎప్పుడు కఠిన చర్యలు తీసుకుంటుందో అన్న ఆందోళనలో ఉన్నారు.