Skip to main content

Posts

బి.పెడ్ 3, 4 సెమిస్టర్ పరీక్షలను తక్షణమే నిర్వహించాలంటూ AIYF డిమాండ్

  అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలో పెండింగ్‌లో ఉన్న 2024–2026 బి.పెడ్ (B.P.Ed) రెండవ సంవత్సరం 3వ, 4వ సెమిస్టర్ పరీక్షలను తక్షణమే నిర్వహించాలంటూ అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) అనంతపురం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. AIYF అనంతపురం జిల్లా అధ్యక్షుడు కొట్రేష్ మాట్లాడుతూ, SKU పరిధిలో ఉన్న విద్యార్థులు పరీక్షలు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2024–26 బ్యాచ్ విద్యార్థులు డీఎస్సీ (DSC) అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే ఆదికవి నన్నయ, విక్రమసింహపురి యూనివర్సిటీలు పరీక్ష తేదీలను ప్రకటించగా, SKU మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి షెడ్యూల్ ఇవ్వకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందన్నారు. విద్యార్థులు SKU అధికారులను సంప్రదించాలంటే కళాశాల ప్రిన్సిపాల్ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. “విద్యార్థులు ఏదైనా ప్రశ్నిస్తే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తామని, పరీక్షలు ఆలస్యం అవుతాయని ప్రిన్సిపాల్ భయపెడుతున్నారు,” అని కొట్రేష్ తెలిపారు. ఈ పరిస్థితుల వల్ల కొంతమంది విద్యార్థులు తీ...

నాగిరెడ్డిపల్లిలో ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

బ్రహ్మసముద్రం: కళ్యాణదుర్గం నియోజకవర్గం, బ్రహ్మసముద్రం మండలం పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామం నేడు భక్తి పారవశ్యంలో మునిగింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మరియు భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు వారి సతీమణి, అనంతపురం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీమతి కాపు భారతి కూడా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు: అర్చకులు వేద మంత్రాల మధ్య విగ్రహ ప్రతిష్టాపనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తుల కోసం ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖుల సందడి: శ్రీ కాపు రామచంద్రారెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, తమ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ మహోత్సవం నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు అత్యంత ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చి...

బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి నియామకం కోసం జరుగుతున్న అభిప్రాయ సేకరణ సందర్భంగ సంయమనం పాటించండి

    సిపిఎం విజ్ఞప్తి   బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎంపిక కోసం  28,వ తేదీ మంగళవారం నాడు బ్రహ్మంగారిమఠం లో జరుగు అభిప్రాయ సేకరణ కార్యక్రమం సందర్భంగ ప్రజలందరూ సంయమనం పాటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.  సోమవారం నాడు బ్రహ్మంగారిమఠంలోని సుందరయ్య భవన్ నందు సిపిఎం మండల కార్యదర్శి జి.సునీల్ కుమార్ మండల కమిటీ సభ్యులు సాన గోవిందస్వామి,y,అజయ్ కుమార్ లతో కలిసి వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగ పీఠాధిపతి అంశంలో కోర్టులో వాజ్యం నడుస్తున్న నేపథ్యంలో మఠం పీఠాధిపతి ఎవరన్న విషయంలో పీటముడి పడిందని కోర్టు యొక్క సూచనతో పిఠాధిపతి అంశం 28,వ తేదీన చివరి అంకానికి వచ్చిందని వారన్నారు. అందులో భాగంగ రేపు బ్రహ్మంగారిమఠం గుడి ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక అధికారి నేతృత్వంలో పిఠాధిపతులు,  వీరబ్రహ్మంగారి భక్తులు శిష్యులు,తదితరులతో మఠాధిపతి ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరుగుతున్నదని అనంతరం అభిప్రాయాలను ధార్మిక పరిషత్తుకు నివేదించి తదనంతరం పిఠాధిపతి ఎంపిక జరగడంతో మఠాధిపతి అంఖానికి తెరపడనున్నదని వారు తెలిపారు. ఈ సందర...

ఘోరం.. నెయ్యి పోసి, సిలిండర్ పేల్చి చంపేసింది

 . ఢిల్లీ అక్టోబర్ 27: ఢిల్లీలో సివిల్స్ అభ్యర్థి హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. సహజీవనం చేస్తున్న రామకేశ్(32) తన ప్రైవేటు వీడియోలు ఇవ్వలేదని అమృత(21) బ్రేకప్ చెప్పింది. ఈనెల 6న EX బాయ్ ఫ్రెండ్ సుమిత్తో కలిసి రామకేశ్ గొంతు కోసి చంపింది. బాడీపై నెయ్యి, వైన్ పోసి గ్యాస్ లీక్ చేసి సిలిండరు పేల్చింది. ఫోరెన్సిక్ చదువు, క్రైమ్ సిరీస్ల తెలివితో అమృత మేనేజ్ చేసినా CCఫుటేజీ, ఫోన్ లొకేషన్తో దొరికిపోయింది..!!

12 రాష్ట్రాల్లో ఎస్ ఐ ఆర్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన

  హైదరాబాద్:అక్టోబర్ 27 ప్రత్యేక సమగ్ర సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది, దేశంలో రెండో విడత సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ను మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది, మొత్తం 12 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండో విడత ఎస్ఐఆర్ చేపడతామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్ జ్ఞానేశ్ కుమార్, వెల్లడించారు. బీహార్‌లో ఎస్ఐఆర్ విజయవంతమైందని, మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని నిర్వహించబోతున్నా మని తెలిపింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడు తూ...రెండో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను త్వరలో చేపట్టనున్నామని వెల్లడించారు. 1951 నుంచి 2004 వరకు ఎనిమిదిసార్లు ఎస్ఐఆర్ నిర్వహించారని అన్నారు. 21 ఏళ్ల కిందట ఓటర్ల జాబితా సవరణ జరిగిందని గుర్తు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నకిలీ ఓట్లు, అక్రమ వలసదారులు, చనిపోయి న, బదిలీ చేయబడిన ఓటర్లను తొలగించినట్లు వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. బీహార్‌లో 7.5 కోట్ల మంది తో ఎస్ఐఆర్ విజయవం తంగా పూర్తయిందని అన్నారు. బీహార్‌లో ఈ ప్రక్ర...

వారి ఓట్లు తొలగిస్తాం.. సీఈసీ కీలక ప్రకటన

  Oct 27, 2025,  దేశంలో దొంగ ఓట్లను తొలగించడానికి, ఓటరు లిస్ట్ ను సరి చేయడానికి CEC స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు SIR రెండో దశ రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు CEC జ్ఞానేశ్ ప్రకటించారు. 12 రాష్ట్రాలలో SIRను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఓటర్ జాబితాను సీజ్ చేస్తామని తెలిపారు. మరణించిన, వలస వెళ్లిన, ఎక్కువ చోట్ల నమోదు చేసుకున్న ఓట్లను తొలగిస్తామన్నారు.

రాజకీయ 'గండం': ఆమిద్యాలలో వెలుగని వీధి దీపం –

  అంధకారంలో కాలనీ వాసులు ఉరవకొండ ప్రాంతంలోని ఆమిద్యాల గ్రామంలో ఒక వీధి దీపం కథ రాజకీయ పంతాలకు, అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ఏళ్ల తరబడి విన్నవించినా, గ్రామంలోని ప్రధాన కూడలిలో ఉన్న వీధి దీపం వెలగకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు., విద్యుత్ స్తంభం ఉన్నప్పటికీ, ఆ ప్రాంతంలో లైటు సౌకర్యం లేకపోవడం లేదా దెబ్బతిన్న లైటును సరి చేయకపోవడం స్పష్టమవుతోంది. ఒకరిపై ఒకరు నెపం: "దీపానికి గ్రహణం" గ్రామంలో ప్రధాన కూడలిలో ఉన్న ఈ వీధి దీపం వెలగకపోవడం వెనుక స్థానిక రాజకీయ 'గండం' దాగి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జవాబుదారీ లేని వైనం: లైటు విషయంలో సర్పంచ్‌ను అడిగితే, ఆయన లైన్‌మెన్‌పై నెపం నెడుతున్నారు. అదే లైన్‌మెన్‌ను అడిగితే, ఆయన సర్పంచ్ వైపు చూపిస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు వేలు చూపించుకుంటూ పోతున్నారే తప్ప, లైటు మాత్రం వెలగడం లేదు.   అధికారుల భయం: "ఈ వీధి దీపం బిగిస్తే మా విధులకు ఇబ్బందులు కలుగుతాయేమో" అనే అసాధారణ భయంతోనే లైటును బిగించడానికి లేదా రిపేర్ చేయడానికి అధికారులు ముందుకు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పాములు, తేళ...