Skip to main content

Posts

నిజాయితీ కి నిలువెత్తు నిదర్శనం ఆటో డ్రైవర్ చంద్రశేఖర్

తాడిపత్రి బస్టాండ్ వద్ద మరచిన 12 తులాల బంగారం సూట్‌కేస్‌, నిజాయితీతో తిరిగి ఇచ్చిన ఆటోడ్రైవర్ చంద్రశేఖర్. డీఎస్పీ గారు ఆటో డ్రైవర్ని ప్రశంసించి శాలువా కప్పి అభినందన  అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్ పరిసరాల్లో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నంద్యాల జిల్లాకు చెందిన లక్ష్మీ తన భర్త, కుమారుడితో కలిసి అనంతపురం వచ్చింది. నగరంలోని 80 ఫీట్ రోడ్, మారుతి నగర్‌లో జరిగే వివాహానికి వెళ్లేందుకు వారు ఆటోడ్రైవర్ చంద్రశేఖర్‌ ఆటో ఎక్కారు. రాంనగర్ వద్ద దిగిన తర్వాత తొందరలోనే తమ సూట్‌కేస్‌ ఆటోలో మర్చిపోయారు. రెండు గంటల తర్వాత బ్యాగు కనిపించకపోవడంతో లక్ష్మి తీవ్ర ఆందోళనకు గురై ఎక్కడికక్కడ వెతుకుతుండగా, మరోవైపు ఆటోడ్రైవర్ చంద్రశేఖర్ తన ఆటోలో సూట్‌కేస్ మిగిలిపోయినట్లు గమనించాడు. ఆయన వెంటనే లక్ష్మి దిగి వెళ్లిన ప్రదేశం వద్దకు తిరిగి వెళ్లి వారికోసం వెతికాడు, కానీ వారెక్కడా కనిపించకపోవడంతో చివరికి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి “ప్యాసింజర్లు మర్చిపోయిన సామాను ఇది” అంటూ సూట్‌కేస్‌ను పోలీసులకు అప్పగించాడు. వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు గారు సూట్‌కేస్ తెరిచి పర...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇకముందు గ్రామ సచివాలయాలు అనే పేరు ఉండదు.వాటిని "విజన్ యూనిట్స్" గా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ప్రకటించారు ప్రజలకు సమర్థవంతమైన, ఆధునిక సేవలు అందించే కేంద్రాలుగా వీటిని మలుస్తాము. ప్రతి గ్రామం అభివృద్ధికి ఇది కొత్త దిశ చూపుతుంది” – సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు._

పాల్తూరులో ఘనంగా కడ్లే గౌరమ్మ వేడుకలు.

ఉరవకొండ నియోజకవర్గం పరిధిలోని విడపనకల్ మండల పాల్తూరు గ్రామంలో గురువారం కడ్లే గౌరమ్మవేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు వీధుల నుంచి కడ్లే గౌరమ్మకు హారతులు ఇచ్చి మొక్కబడును తీర్చుకున్నారు. సాయంత్రం పలు వీధి నుంచి మహిళలు హారతులతో గ్రామం కిటకిటలాడింది. ఈ సందర్భంగా కడ్లే గౌరమ్మ విగ్రహానికి వివిధ పుష్పాలతో, వివిధ చీరలతో ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు తరలివచ్చి పూజల అభిషేకలు చేయించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు.

గెలుపొందిన వారికి బహుమతులు అందజేత.

   ఉరవకొండ . విడపనకల్ మండలం పాల్తూరు గ్రామంలో కడ్లే గౌరమ్మ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించారు. గెలిచిన వారికి 1  మొదటి బహుమతి,6000 రెండవ బహుమతి, 4000 మూడవ బహుమతి, 2000 విడపనకల్ మండల టిడిపి మండల కన్వీనర్ బీడీ చిన్న మరయ్య విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కైమూర్‌లో మాయావతి శక్తివంతమైన ప్రసంగం: 'బహుజనుల గళం బలంగా వినిపించాలి

   కైమూర్, బీహార్ : బహుజన్ సమాజ్ పార్టీ (BSP) జాతీయ అధ్యక్షురాలు మరియు ఉత్తరప్రదేశ్‌కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారి మాయావతి ఈరోజు (తేదీ లేదు) బీహార్‌లోని కైమూర్ జిల్లాలో జరిగిన భారీ ప్రజా ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.  బీఎస్పీ అభ్యర్థులకు అఖండ మద్దతు ఇవ్వాలని పిలుపు బహుజనుల హక్కులు, గౌరవం మరియు న్యాయం కోసం మాయావతి తన ప్రసంగంలో ప్రధానంగా ఉద్ఘాటించారు. బహుజనుల గళం శాసనసభల్లో బలంగా, గౌరవంగా, న్యాయంతో మరియు సరైన ప్రాతినిధ్యంతో వినిపించబడాలంటే, బీఎస్పీ అభ్యర్థులను అఖండ మద్దతుతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. మీరు మీ హక్కుల కోసం పోరాడాలంటే, మీ సమస్యలు పరిష్కారం కావాలంటే, బీఎస్‌పీ అభ్యర్థులను బలపరిచి వారిని అసెంబ్లీకి పంపాలి," అని ఆమె పేర్కొన్నారు. మాయావతి ప్రసంగం వినేందుకు కైమూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, బీఎస్‌పీ కార్యకర్తలు తరలివచ్చారు. రాష్ట్రంలో బహుజనుల రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. నెక్స్ట్ స్టెప్: బీహార్‌ ఎన్నికల గురించి లేదా బీఎస్‌పీ పార్టీకి సంబంధించిన మరిన్ని జాతీయ వ...

ఫిలిప్పీన్స్ వరదల విధ్వంసం.. ఎమర్జెన్సీ ప్రకటన

ఫిలిప్పీన్స్ కాల్మేగీ తుఫాను బీభత్సానికి 114 మందికిపైగా బలయ్యారు. భారీ వర్షాలు, వరదలకు మరో 127 మంది గల్లంతయ్యారు. దీంతో దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దాదాపు 20 లక్షల మందిపై ప్రభావం పడిందని, 5.6 లక్షల మంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. సెబూ ప్రావిన్స్ ని పట్టణాలను వరదలు ముంచెత్తాయని, ఎక్కువ నష్టం అక్కడే జరిగిందని చెప్పారు.

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

విడపనకల్ మండలం గాజుల మల్లాపురం,కరకముక్కల గ్రామాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే,ఉరవకొండ వైసీపీ ఇన్చార్జ్,పిఎసి సభ్యులు వై.విశ్వేశ్వర్ రెడ్డి,యువనేత వై.ప్రణయ్ రెడ్డి ఆదేశాల మేరకు విస్తృతంగా కొనసాగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ సీనియర్ నాయకులు కరణం భీమరెడ్డి,భరత్ రెడ్డి,మండల కన్వీనర్ కురుబ రమేష్,లతవరం గోవిందు,సర్పంచ్ రామాంజనేయులు రెడ్డి,హంపయ్య,పాల్తూరు శివ,రామన్న,పురుషోత్తం ఆదిమూలం,కావలి వెంకటేష్, ఎర్రస్వామి రెడ్డి,వన్నారెడ్డి,ఆనంద్ రెడ్డి,బండే గౌడ్,బస్టాండ్ రాజు,గంగిరెడ్డి,మల్లికార్జున,ఓంకార్ రెడ్డి,నాగరాజు,రాజన్న,వన్నూరు స్వామి,శేఖర్,గురుదాస్,స్వామి తదితరులు పాల్గొన్నారు.