Skip to main content

Posts

దివ్యాంగులకు షరతులు లేకుండా ట్రైసైకిళ్లు, ఫోర్ వీలర్ బైకులు ఇవ్వాలి: ఉరవకొండలో 'హరిత దివ్యాంగుల సేవా సమితి' డిమాండ్

  ఉరవకొండ దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి, ప్రస్తుతం ఉన్న కఠిన షరతులను తొలగించి, అర్హులైన ప్రతి దివ్యాంగునికి ట్రైసైకిళ్లు (మూడు చక్రాల సైకిళ్లు) మరియు ఫోర్ వీలర్ బైకులు (నాలుగు చక్రాల బైకులు) మంజూరు చేయాలని హరిత దివ్యాంగుల సేవా సమితి డిమాండ్ చేసింది. ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ ఆవరణలో హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బి. మోహన్ నాయక్ దివ్యాంగులతో కలిసి ఆదివారం నాడు ఒక సమావేశం నిర్వహించారు. సమస్య: కఠిన షరతుల కారణంగా పథకం అందడం లేదు ఈ సందర్భంగా బి. మోహన్ నాయక్ మాట్లాడుతూ... గతంలో దివ్యాంగులకు ఫోర్ వీలర్ బైకులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టినా, దానికి కఠినమైన షరతులు పెట్టడం వలన ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని, చాలా మంది దివ్యాంగులు ఆ పథకాన్ని అందుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పెట్టిన ప్రధాన షరతులు:   విద్యార్హత: డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే నాలుగు వీలర్ బైక్ మంజూరు చేయడం.  శారీరక వైకల్యం శాతం: 50% నుండి 70% వైకల్యం ఉన్న వారికి ట్రైసైకిళ్ళు, నాలుగు వీలర్ బైకులు ఇవ్వడం...

శేషాచలం సంపద రక్షణ: ఎర్ర చందనం గోదాముల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీ

  తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి కె. పవన్ కళ్యాణ్ శనివారం నాడు తిరుపతి జిల్లాలో సుదీర్ఘంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంగళం ప్రాంతంలోని అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం నిల్వ గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. శేషాచలం అడవుల అపురూప సంపదైన ఎర్ర చందనం రక్షణ, అక్రమ రవాణా నియంత్రణపై ఆయన అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. గోదాముల్లో క్షుణ్ణంగా తనిఖీ, రికార్డుల పరిశీలన తిరుపతి జిల్లా మంగళంలో ఉన్న అటవీ శాఖ గోదాములకు చేరుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొత్తం ఎనిమిది గోదాముల్లో నిల్వ ఉన్న ఎర్ర చందనం దుంగలను స్వయంగా పరిశీలించారు.   గ్రేడ్ల వారీగా వివరాలు: 'ఎ', 'బి', 'సి', నాన్-గ్రేడ్ల వారీగా వర్గీకరించిన ఎర్ర చందనం దుంగల లాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.   రికార్డుల తనిఖీ: ప్రతి గోదాములో ఉన్న నిల్వ రికార్డులను, లావాదేవీల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి వాస్తవికతను సరిచూసుకున్నారు.  ప్రత్యేక దృష్టి: ఎర్ర చందనం దుంగల బరువు, నాణ్యతను తెలుసుకునేందుకు స్వయంగా ఒక ...

సంక్షేమ కార్యక్రమాలకు గైర్హాజరు: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనని 48 మంది శాసనసభ్యుల (ఎమ్మెల్యేలు) తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి, వారిపై చర్యలకు ఆదేశించారు. ప్రజా సంక్షేమ పథకాల పంపిణీలో తప్పనిసరిగా పాల్గొనాల్సిన బాధ్యతను నిర్లక్ష్యం చేయడాన్ని ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నారు. చర్యలకు ఆదేశం: ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ సమీక్షా సమావేశంలో భాగంగా, గైర్హాజరైన 48 మంది ఎమ్మెల్యేల వైఖరిపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఎమ్మెల్యేలందరికీ తక్షణమే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు జవాబుదారీగా ఉండాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలనే ఉద్దేశాన్ని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. ఎంఎల్ఏలు నిర్లక్ష్యం చేసిన కీలక కార్యక్రమాలు గైర్హాజరైన ఎమ్మెల్యేలు ముఖ్యంగా రెండు కీలక ప్రజా సేవలకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనకపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు:   పింఛన్ల పంపిణీ (సామాజిక భద్రతా పింఛన్లు): వృద్ధులకు, నిస్సహాయులకు జీవనాధారం కల్పించే సామాజిక భద్రతా పింఛన్ల నెలవారీ పంపిణీ కార్యక్రమం. ...

నేడే 9న తిరుమలలో కార్తీక వన భోజనం

  తిరుమల,: వన భోజన కార్యక్రమం నవంబరు 9వ తేది తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరుగనుంది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటు పిమ్మట మధ్యాహ్నం 1 నుండి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు

చాబాల ఘనంగా కనకదాసు 538 వ జయంతి వేడుకలు

  అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల పరిధిలో ని చాబాల గ్రామంలో శనివారం రోజు రాత్రి 7.గంటల సమయంలో గ్రామం లోని శివాలయం లో పూజలు నిర్వాహించి అనంతరం భక్త కనకదాసు విగ్రహాన్ని గ్రామం లోని పురావీధుల గుండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం లో కురుబ నాయకులు LIC పుల్లయ్య, ఘానాచారి గోపాల్, ఆటో ఉమాపతి,చక్రి స్వామి, కామాటం భీలింగ, ఈశ్వరయ్య,గోవర్ధన్, నాగరడోన్ గొపాల్,లింగరాజు, ఎర్ర నాగరాజు,చంద్రమౌళి, వైస్సార్ సీపీ ఉపసర్పంచ్ కుల్ల యిస్వామి, గురుమూర్తి, కురుభ సోదరులు గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు

ఘనంగా గజ గౌరీ అమ్మవారి హారతులు వేడుకలు.

  కనేకల్లుమండలం మీనా హళ్లి గ్రామంలో శనివారం పండుగ వాతావరణం నెలకొంది.  మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై, జాజిపూలు, కొబ్బరికాయలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. డప్పుల మోగింపు, సాంస్కృతిక వాతావరణంతో గ్రామాలు జాతరను తలపించాయి, సందడిగా మారాయి. పురుషులు, యువతులు, బాలబాలికలు పెద్ద సంఖ్యలో హారతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.  శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థన: గజ గౌరీ అమ్మవారి పూజలతో గ్రామంలో శాంతి, సౌభాగ్యం కలగాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. పూజల అనంతరం మహిళలు పరస్పరం తాంబూలాలు పంచుకున్నారు. ఈ వేడుకతో గ్రామమంతా పండుగ శోభతో కళకళలాడింది. గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి రోడ్డు వరకు విద్యుత్ దీపాలు ఆకర్షించాయి. సుంకులమ్మ దేవాలయం నుంచి ఎస్సీ కాలనీ వరకు విద్యుత్ దీపాలు ఆకర్షించాయి. ఈ వేడుకల్లో మర్రి స్వామి, బిజెపి బాలరాజు, బి,టి వెంకటేశులు,డి యువరాజు, డి వన్నూరు స్వామి, ఎర్రప్ప,కురుబ వన్నూరు స్వామి, శేఖర, డి బసప్ప, బోయ వండ్రప్ప, మాజీ వాలంటీర్ బద్రి, జెసిబి నాగరాజు, కన్నయ్య, యువత పాల్గొని హారతులు కార్యక్రమం విజయవంతం చేశారు.

బస్సులో పసికందు వాంతి… బాలింతతోనే శుభ్రపరిచించిన సిబ్బంది!

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం డిపో: కళ్యాణదుర్గం డిపో ఆర్టీసీ బస్సులో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల పసికందు తల్లిపాలు కక్కడంతో బస్సులో స్వల్ప మురికి పడింది. అయితే, బస్సు సిబ్బంది సున్నితంగా స్పందించకుండా, ఆ బాలింత చేతనే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయమని ఒత్తిడి చేసినట్లు ప్రయాణికులు వెల్లడించారు. సాక్ష్యుల ప్రకారం, శిశువు వాంతి చేసిన ప్రదేశాన్ని తల్లి స్వయంగా నీళ్లు పోసి శుభ్రం చేయాల్సి వచ్చింది. ఈ దృశ్యం చూసిన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వంటి సేవా రంగాల్లో ఇలాంటి అమానవీయ వైఖరి అంగీకారయోగ్యం కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులు ఈ ఘటనపై డిపో మేనేజర్ తక్షణ విచారణ జరిపి, సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.