Skip to main content

Posts

అనంతపురంలో 'ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్'కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శంఖుస్థాపన

  అనంతపురం, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ఈరోజు (మంగళవారం) అనంతపురం నగరంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) కు సంబంధించిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. జెఎన్టీయూ మార్గంలో ఉన్న సిరికల్చర్ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేశవ్ పాల్గొన్నారు. ముందుగా ఆయన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ తదితరులతో కలిసి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రాజెక్టు వివరాలు  ప్రాంగణం: సిరికల్చర్ కార్యాలయంలోని ప్రాంగణం   విస్తీర్ణం: 4 ఎకరాల విస్తీర్ణంలో   మంజూరైన నిధులు: ఈ ప్రాజెక్టు కోసం రూ. 16 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణంతో అనంతపురం నగరంలో పారిశ్రామిక అభివృద్ధికి, ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు మరింత ఊతం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఢిల్లీ పేలుడు.. ఒకరి అరెస్ట్

  ఢిల్లీలో పేలుడు ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ఘటన గురించి విచారిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. సాయంత్రం 6.52 గంటలకు బ్లాస్ట్ జరిగిందన్నారు. నెమ్మదిగా వచ్చిన కారు.. రెడ్లైట్ దగ్గర ఆగి ఆగగానే ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగిందని తెలిపారు. కారు వెనకాలే ఉన్న మరిన్ని కార్లకు మంటలు అంటుకుని పేలుడు తీవ్రత పెరిగిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక పరిణామం... పోలీసుల అదుపులో కారు యజమాని!

ఢిల్లీ దిల్లీ కారు పేలుళ్ల కేసులో మాజీ యజమాని సహా ఇద్ద రు అరెస్ట్ ఎర్రకోట సమీపంలో జరిగిన ఘటనలో 13 మంది మృతి, 24 మందికి గాయాలు పేలుడుకు ఉపయోగించిన కారు హరియాణాకు చెందినదిగా గుర్తింపు ఉగ్రవాద కుట్ర కోణంలో దర్యాప్తు చేస్తున్న భద్రతా ఏజెన్సీలు రెడ్‌లైట్ వద్ద ఆగిన కారులో సంభవించినట్లు వెల్లడించిన పోలీసులు ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ రాజధాని దిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు ఘటన దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పేలుడుకు ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు, దాని యజమానితో పాటు, గతంలో కారు సొంతదారును కూడా అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన నదీమ్‌ఖాన్‌ పేరిట కారు రిజిస్టర్ అయి ఉండగా, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఆ కారును కొనుగోలు చేసిన మహ్మద్ సల్మాన్‌ను కూడా గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం సాయంత్రం 6.52 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలోని రెడ్‌లైట్ వద్ద ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెంద...

మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యం.. పి..గన్నవరం మండలం ఎర్రం శెట్టి వారి పాలెం వద్ద ఒకచోట వదిలి వెళ్ళిపోయిన కిడ్నాపర్..

 మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యం.. పి..గన్నవరం మండలం ఎర్రం శెట్టి వారి పాలెం వద్ద ఒకచోట వదిలి వెళ్ళిపోయిన కిడ్నాపర్.. అమలాపురంలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్న బాలిక నిన్న సాయంత్రం మేనమామ వరస అయిన ఒక వ్యక్తి పాపను తీసుకెళ్లిన ఘటన జిల్లాలో సంచలనగా మారిందినిన్న సాయంత్రం నుండి పాప ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేశారు ఈరోజు ఉదయం పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టి వారి పాలెం వద్ద పాప ఆచూకీ కనుక్కున్న అమలాపురం పట్టణ పోలీసులు. అమలాపురం పట్టణ సిఐ వీరబాబు ఆధ్వర్యంలో రాత్రంతా పాప కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి పాప ఆచూకీ కనుక్కున్న పోలీసులు.. మరికొద్ది సేపట్లో పట్టణ సిఐ వీరబాబు పాపను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.........

దిల్లీలో పేలుడు.. పోలీసులకు హైఅలర్ట్‌

దిల్లీ నగరంలో ఘోర పేలుడు చోటుచేసుకుంది. ఎర్రకోట మెట్రో స్టేషన్‌ గేట్‌ నంబర్‌ 1 వద్ద పార్కింగ్‌ స్థలంలో నిలిపివున్న ఓ కారులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ (LNJP) ఆస్పత్రికి తరలించారు. పేలుడు చోటుచేసుకున్న ప్రాంతంలో ఆందోళన నెలకొంది. వెంటనే దిల్లీ పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), క్లూస్‌ టీమ్‌, ఫోరెన్సిక్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. అసలు ఈ పేలుడు ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విస్తృత దర్యాప్తు ప్రారంభించారు. ఏడు ప్రత్యేక బృందాలు ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించి విశ్లేషిస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు అపోహలు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇకపై పోలీసులు ఎవర్ని అరెస్టు చేసిన..... లికిత పూర్వకంగా కారణం తెలపాల్సిందే..! సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అరెస్టు అయిన నిందితుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించే దిశగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం.. ఎలాంటి నేరం కింద అరెస్టు చేసినా సరే, ఎలాంటి మినహాయింపులు లేకుండా అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా, నిందితుడికి అర్థమయ్యే భాషలోనే తెలియజేయాలని స్పష్టం చేసింది.  రాజ్యాంగంలోని అధికరణం 22(1) ప్రకారం.. అరెస్టు చేసిన వ్యక్తికి అరెస్టు కారణాలు సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలనే అంశాన్ని ఈ తీర్పు బలంగా సమర్థించింది జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌ 52 పేజీల తీర్పులో.. "ఇది ఏదో లాంఛనప్రాయంగా పాటించాల్సిన విధానం కాదు. ఇది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక రక్షణ" అని స్పష్టం చేశారు. ముఖ్యంగా తనను ఎందుకు అరెస్టు చేశారో, తనపై మోపిన నేరారోపణల స్వభావం ఏమిటో నిందితుడికి తెలియాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది.  ఈ జ్ఞానం మాత్రమే నిందితుడు న్యాయ సహాయం కోసం ప్రయత్నించడానికి, తనపై వచ్చిన ఆరోపణలకు తగిన విధంగా ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుంది  రిమాండ...

పిపిపి విధానానికి వ్యతిరేకంగా విద్యార్థుల సంతకాల సమరం – వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

  పిపిపి విధానానికి వ్యతిరేకంగా విద్యార్థుల సంతకాల సమరం వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించే పిపిపి (PPP) విధానానికి వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఒక్కటైంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విద్యార్థుల మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా వైయస్ఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల అమరనాథ్ రెడ్డి , శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు పురుషోత్తం రాయల్ గార్లు పలు కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సంతకాలు చేయించి పిపిపి విధానానికి వ్యతిరేకంగా తమ మద్దతు తెలియజేశారు. “కూటమి ప్రభుత్వం కుట్రలతో పేదలకు వైద్య విద్యను దూరం చేస్తూ, ప్రైవేట్ వారికి అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ఇది ప్రజా వ్యతిరేక చర్య,” అని అమరనాథ్ రెడ్డి విమర్శించారు. విద్యార్థులు తమ కుటుంబాలకు, సమాజాన...