Skip to main content

Posts

ఊరగాద్రి బాలోత్సవం లో కొనకొండ్ల ఎం జె పి విద్యార్థు విజయకేతనం

    జాతీయ బాలల దినోత్సవ సందర్భంగా నిస్వార్థ ఫౌండేషన్ నవతరం సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ ఉరవకొండ వారు నిర్వహించిన వివిధ రకాల పోటీలలో వజ్రకరూరు మండలం కొనకొండ్ల మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకులం విద్యార్థులు ప్రతిరంగంలోనూ ప్రధమ బహుమతి సాధించారు 8వ తరగతి విద్యార్థి ఎస్.కె జంగి బంజారా పబ్లిక్ స్పీకింగ్ చేరవాణి వాడకం వల్ల కలిగే లాభనష్టాలపై జరిగిన పోటీలో ప్రధమ బహుమతి అందుకున్నారు తేజేశ్వర్ రెండవ బహుమతి అందుకున్నారు డ్రాయింగ్ లో కార్తీక్ ప్రథమ స్థానం ఎస్.కె నిఖిల్ పబ్లిక్ స్పీకింగ్లో ప్రధమ స్థానం ప్రథమ స్థానం డి సందీప్ కుమార్ స్టోరీ టెల్లింగ్ లో ప్రథమ స్థానం కార్తీక్ పాటలో ప్రథమ స్థానం గౌతమ్ నాయక్ పాటలో ప్రధమ స్థానం ప్రధమ స్థానం బహుమతులను అందుకున్నారు ఈ సందర్భంగా శనివారం గురుకులం ప్రిన్సిపాల్ ఝాన్సీ రాణి విద్యార్థులను అభినందించారు విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో కూడా ప్రతిభ కనపర్చాలని ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానవ మనుగడ ఉనికి సాధించాలంటే అన్ని రంగాలలో ముందుండాలని కోరారు విద్యార్థులు ఆటల పోటీలలో గెలుపొందడానికి ప్రేరేపించిన ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా అభి...

చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో..వై. ప్రతాప్ రెడ్డి

  పుస్తకం ఒక మంచి నేస్తం. ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో శనివారం 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. చినిగిన చొక్కా అయినా తొడుక్కో - ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక మంచి మాట తో పుస్తకం విలువను పుస్తకం ఆవశ్యకతను గురించి తెలుపుతూ - పుస్తక ము ఒక మంచి నేస్తం అని పుస్తకాలను చదివే అలవాటు చిన్నప్పటినుంచే అలవర్చుకోవాలని , నేటి చరిత్ర భావితరాలకు అందించే ఒక అద్భుతమైన రూపమే పుస్తకం, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానమనే జ్యోతిని మనలో వెలిగించి ముందుకు నడిపే సాధనమే పుస్తకమని ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థినిి విద్యార్థులకు తెలియజేయడమైనది. ఈ పుస్తక ప్రదర్శన లో స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన పుస్తకాలు, విజ్ఞానానికి వినోదానికి సంబంధించిన పుస్తకాలు , ఆధ్యాత్మిక పుస్తకాలు, కవితలు- కథల పుస్తకాలు, ప్రదర్శించడం జరిగింది . ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి వై ప్రతాపరెడ్డి,H. M. శ్యామ్ ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయ పాఠకులు ప్రజలు పాల్గొన్నారు.

పాల్తూరు అంగన్వాడీ కేంద్రంలో అనుబంధ పోషకాహారంపై అవగాహన సదస్సు

  - బాలల దినోత్సవం సందర్భంగా ఆటపాటలు, బహుమతుల పంపిణీ విడపనకల్ మండల పరిధిలోని పాల్తూరు గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం నాడు అనుబంధ పోషకాహారంయొక్క ఆవశ్యకతపై అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పీహెచ్సీ వైద్యులు డా. శంకర్ నాయక్ మరియు అంగన్వాడీ సూపర్వైజర్ పుష్పావతి పర్యవేక్షణలో నిర్వహించారు. తల్లులకు ఆరోగ్య అవగాహన: ఈ సందర్భంగా వైద్యులు మరియు సిబ్బంది ముఖ్యంగా తల్లులకు పోషకాహారం ప్రాముఖ్యత గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ చిన్నారులందరి ఎత్తు, బరువులను కొలవడం జరిగింది. ప్రతి బిడ్డ యొక్క వయస్సుకు తగిన ఎత్తు, వయస్సుకు తగిన బరువు ఉండాల్సిన ప్రామాణికాలను గుర్తించి, వాటిపై తల్లులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. బాలల దినోత్సవ వేడుకలు: అదేవిధంగా, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు పలు రకాల ఆటపాటలను ఏర్పాటు చేసి, ఉల్లాసంగా గడిపారు. చివర్లో ఆటల్లో పాల్గొన్న విజేతలతో పాటు పిల్లలందరికీ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమం...

బీసీ జనగణన పూర్తి చేశాకే స్థానిక ఎన్నికలు: హైకోర్టులో కీలక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)

    1986 తర్వాత జరగని జనగణన; రిజర్వేషన్లపై తీవ్ర ప్రభావం అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మరోసారి న్యాయపరమైన వివాదం తలెత్తింది. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల (BC) జనగణనను పూర్తి చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలను నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ఒక కీలకమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ పిల్ కారణంగా రాష్ట్రంలో త్వరలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. పిటిషన్ వేసినవారు, ప్రధాన వాదన  పిటిషనర్: ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు ఈ పిల్ దాఖలు చేశారు.   ప్రధాన వాదన: పిటిషనర్ తన వాదనలో ప్రధానంగా సమానత్వం మరియు న్యాయం అనే అంశాలను లేవనెత్తారు. షెడ్యూల్డ్ కులాలు (SC) మరియు షెడ్యూల్డ్ తెగలకు (ST) జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పుడు, బీసీల విషయంలో మాత్రం ఆ నియమాన్ని ప్రభుత్వం పాటించడం లేదని ఆయన ఆరోపించారు.   బీసీ జనగణన సమస్య: 1986 తర్వాత రాష్ట్రంలో బీసీ జనగణన జరగలేదని శంకరరావు స్పష్టం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా జనాభా గణాంకాలు అప్‌డేట్ కాకపోవడం వల్ల,...

క్లాసులకు 'గోవింద'వాడ టీచర్ డుమ్మా: స్కూల్ ఆవరణలో గంటల తరబడి సెల్‌ఫోన్ సంభాషణలు!

   అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండల పరిధిలోని 'గోవింద'వాడ టీచర్ క్లాసులకు డుమ్మా కొడుతూ సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లు చెబుతున్నారని విద్యార్థుల తల్లి దండ్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సంఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. బొమ్మనహల్ మండలం, గోవిందవాడ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు స్కూల్ టైమింగ్‌లో తరగతులకు డుమ్మా కొట్టి, పాఠశాల ఆవరణలో గంటల తరబడి సెల్‌ఫోన్‌లో సంభాషణలు జరుపుతూ కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నియమావళి ఉల్లంఘన: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పని వేళల్లో తప్పనిసరిగా విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, పాఠశాల పని వేళలో అత్యవసరం కాని సెల్‌ఫోన్ సంభాషణలు జరపకూడదని విద్యా శాఖ నియమావళి స్పష్టంగా ఉంది. అయితే, ఈ ఉపాధ్యాయుడు నిబంధనలను ఉల్లంఘిస్తూ రోజూ విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్నారని స్థానికులు మరియు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠాలకు తీవ్ర అంతరాయం: ఉపాధ్యాయుడు పిల్లలకు చదువు చెప్పా...

విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

  విశాఖపట్నం విశాఖ ఐఎన్ఎస్ డేగాలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్  ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు కాసేపట్లో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ జరిగే ఏయూ ప్రాంగణానికి చేరుకోనున్న ఉప రాష్ట్రపతి రెండు రోజుల పాటు జరిగే భాగస్వామ్య సదస్సును ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి

బిక్షాటన నిషేధం ఎవరికోసం?:కేవి రమణ, రాష్ట్ర ఉపాధ్యక్తులు వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక

       బిక్షాటనా నిషేధ చట్టం- 2025 ఎవరికోసం?భిక్షాటనకు నిర్వచనం ఏమిటి?     ఒకప్పుడు భిక్షాటనకు నిర్వచనం ఆకలికి అడుక్కోవడం.నేడది ఒక స్టేటస్,పోరాట రూపం.    మరి నేడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిక్షాటన నిషేధ చట్టం- 2025 ఆకలి కోసం చేసే భిక్షాటనను నిషేధించడమా? లేక వ్యక్తిగత స్టేటస్,లేదా పోరాటం కోసం చేసే భిక్షాటనను నిషేధించడమా? కేవలం ఆకలి కోసం చేసే పేదల బిక్షాటనను నిషేధించడమే అయితే ఉపయోగం లేదు. బిక్షాటన ఏ రూపంలో ఉన్నా,ఎవరు చేసినా నిషేధించబడాలి,అప్పుడే ఈ చట్టానికి అర్థం,పరమార్థం. లేకుంటే రాజకీయపరమైన నిషేధమే అవుతుంది.     రాష్ట్రంలో భిక్షాటనను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది,దీంతో బిక్షాటన నివారణ లేక సవరణ చట్టం- 2025 అమలులోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం భిక్షాటన చేస్తే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారట, యాచకులకు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు మాత్రమే సహాయం చేయాలట,ఈ చట్టం ఉద్దేశం బిక్షాటన మాఫియా, వ్యవస్థీకృత బిక్షాటనను నిర్మూలిస్తుందట,అదే నిజమైతే మన రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం చేసినది ఏమిటి?అది ఈ చట్టం కిందికి వస్తుందా,...