విడుపనకల్ : గ్రామంలో ఇళ్లకు సంబంధించిన ఉపాధి హామీ బిల్లులు మంజూరు పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్ జీ. సురేష్ రూ.2,000 లంచం డిమాండ్ చేస్తున్నాడంటూ బళ్లారి సుశీలా, బళ్లారి రాముడు, సరస్వతి మంగళవారం సచివాలయం వద్ద టీడీపీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. అంటువారి మాటల్లో, “మేము ఇప్పటికే రూ.1,500 ఇచ్చినా బిల్లులు మంజూరు చేయలేదు. ఇంకా డబ్బులు అడుగుతున్నారు” అని వాపోయారు. దీనిపై అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్‌ను సచివాలయానికి పిలిపించి విచారించగా, సురేష్ బహిరంగంగానే, “నేను ఒక్కడినే తీసుకోలేదు… కింది స్థాయి నుంచి పైస్థాయి ఉన్నతాధికారుల వరకూ అందరికీ వాటా ఇవ్వాలి. ఈసీ వసూళ్లు చేసి ఇవ్వమంటేనే వసూళ్లు చేశాను” అని చెప్పాడు. ఈ విషయాన్ని వెంటనే సచివాలయ సిబ్బంది ఉపాధి హామీ ఈసీకి ఫోన్‌లో తెలియజేశారు. ఈసీ గురు ఫోన్‌లోనే సురేష్‌ను ప్రశ్నిస్తూ, “నేను నీకు వసూళ్లు చేయమని చెప్పానా? డబ్బులు తీసుకుని ఎవరికి ఇచ్చావు?” అని నిలదీశాడు. అప్పుడే సురేష్ మాట మార్చి, “ఎవ్వరూ చెప్పలేదు… నేనే వసూళ్లు చేసి నా దగ్గరే పెట్టుకున్నాను” అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఉపాధి హామీ అధికారులు స్పందిస్తూ, “ఇళ్లకు సంబంధించిన ఉపాధి బ...
Local to international