Skip to main content

Posts

⚖️ తీర్పుల ప్రకటనలో నిబంధనల ఉల్లంఘన: జడ్జిపై వేటు!

  CrPC సెక్షన్ 353 నిబంధనల ఉల్లంఘనే కీలకం; న్యాయ వ్యవస్థలో పారదర్శకత ఆవశ్యకతపై చర్చ  ధర్మవరం జడ్జి తొలగింపునకు ప్రధాన కారణం ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి బి. కృష్ణవేణి ని ఉద్యోగం నుండి తొలగించడానికి (Removal from Service) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో వెనుక, భారతీయ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్షన్ 353 నిబంధనలను ఉల్లంఘించడమే ముఖ్య కారణంగా నిలిచింది.  ఏమిటీ CrPC సెక్షన్ 353? CrPC సెక్షన్ 353 అనేది న్యాయస్థానంలో తీర్పును ప్రకటించే (Pronouncement of Judgment) పద్ధతిని వివరిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం, న్యాయమూర్తి:  * తీర్పును తప్పనిసరిగా బహిరంగ న్యాయస్థానంలో ప్రకటించాలి.  * తీర్పును రాసిన తర్వాత లేదా ప్రకటించిన తర్వాత, దానిపై తేదీతో సహా సంతకం (Signature) చేయాలి.  * ముఖ్యంగా, పూర్తి తీర్పు లేకుండా కేవలం 'డాకెట్ ఆర్డర్' తో కేసులను ముగించకూడదు.  రుజువైన ఉల్లంఘనలు: పారదర్శకతకు భంగం జడ్జి శ్రీమతి కృష్ణవేణిపై హైకోర్టు విజిలెన్స్ శాఖ జరిపిన విచారణలో, ఈ సెక్షన్ యొక్క నిబంధనలను అతిక్రమించినట్లు స్పష్టంగా రుజువైంది. రుజువైన ఆరోపణలు:  ...

మోటరైజ్డ్ మూడు చక్రాల వాహనాల ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువు పొడిగింపు

    దరఖాస్తుల చివరి తేదీ : 30-11-2025 ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ (APDASCAC), విజయవాడ అర్హులైన విభిన్న సామర్థ్యుల కోసం మోటరైజ్డ్ మూడు చక్రాల వాహనాల మంజూరుకు సంబంధించిన *ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ గడువు అధికారికంగా పొడిగించబడినది*. *దరఖాస్తుల చివరి తేదీ : 30-11-2025* 100% శాతం ఆర్థోపెడిక్లీ హ్యాండిక్యాప్‌డ్ (Orthopedically Handicapped) అయిన అర్హులైన అభ్యర్థులు మోటరైజ్డ్ మూడు చక్రాల వాహనాల మంజూరుకు సంబంధించి తమ దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ www.apdascac.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా 30-11-2025 లోపు సమర్పించవలసిందిగా తెలియజేయబడుతుంది. అభ్యర్థులు సూచించిన గడువులోపు దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలి. శ్రీ గడుపుటి నారాయణ స్వామి చైర్మన్, ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ, ఆంధ్రప్రదేశ్.

⚖️ సంచలనం: ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి బి. కృష్ణవేణి 'రిమూవల్ ఫ్రమ్ సర్వీస్'

  విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం, న్యాయ ప్రక్రియల ఉల్లంఘన రుజువు: హైకోర్టు సిఫారసుతో ఉద్యోగం నుండి తొలగింపు  ఉద్యోగం నుండి తొలగింపుకు ప్రభుత్వం జీవో జారీ ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థలో సంచలనం సృష్టిస్తూ, సస్పెన్షన్‌లో ఉన్న ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి బి. కృష్ణవేణి పై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన సిఫారసు ఆధారంగా, శ్రీమతి కృష్ణవేణి కి అత్యంత కఠినమైన శిక్ష అయిన "Removal from Service" (ఉద్యోగం నుండి తొలగింపు) విధిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వు (G.O.) జారీ చేసింది.  విచారణకు దారి తీసిన ఆరోపణలు సీనియర్ సివిల్ జడ్జిపై చర్యలకు దారితీసిన అంశాలలో, హైకోర్టు విజిలెన్స్ శాఖకు అందిన పలు ఫిర్యాదులు కీలకంగా మారాయి. దీనితో పాటు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి (అనంతపురం) స్వయంగా సమర్పించిన (సుయో మోటో) నివేదిక ఆధారంగా మొత్తం పన్నెండు ఆరోపణలు (Articles of Charge) రూపొందించబడ్డాయి. ఈ ఆరోపణలపై విభాగ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.  ఆరు ఆరోపణలు రుజువు: నివేదిక సమర్పణ ఈ విభాగ విచారణ బాధ్యతను కడప ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జికి అప్పగించగా...

ఉరవకొండ లో ఘనంగా రాజ్యాంగ దినో తోత్సవ వేడుకలు

  ఉరవకొండ:ట్రూ టైమ్స్ ఇండియా జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేయడమైనది అదే విధముగా ఘన నివాళులర్పించడం జరిగినది   ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు లేపాక్షి  గౌరవ అధ్యక్షులు తమన్నా    సెక్రెటరీ రాజేష్   ఉపాధ్యక్షులు సోమశేఖర్   ఈసీ మెంబర్స్ మోహన్  విజయ్ ( గంగోల రాజు ) అజిత్ సురేష్ నల్లారెడ్డిబీరువాలు రాము శివహనుమేష్ సాయిగిరి మనీమల్లికార్జున బాలాజీగోవింద్లక్ష్మీనారాయనడిసిసి జనరల్ సెక్రెటరీసోనియా సీన.   ఈ కార్యక్రమంలో మరికొందరు పాల్గొనడం జరిగింది

తిరుమలలో టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన చంద్రగిరి ఎమ్మెల్యే నాని: నియోజకవర్గ ఆలయాల అభివృద్ధికి సహకారం కోరిక

  తిరుమల (నవంబర్ 26, 2025): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో బుధవారం టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు గారిని చంద్రగిరి శాసనసభ్యులు (ఎమ్మెల్యే) పులివర్తి నాని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు పురాతన, చిన్న దేవాలయాల అభివృద్ధి, పునరుద్ధరణ పనుల కోసం టీటీడీ తరఫున ఆర్థిక సహాయం మరియు సహకారం అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని, ఛైర్మన్ ని అభ్యర్థించారు. ఆలయాల అభివృద్ధిపై చర్చ: చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఉన్న కొన్ని దేవాలయాలు సరైన నిధులు లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయని, వాటిని అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ప్రజల ఆధ్యాత్మిక అవసరాలు తీరడంతో పాటు, సాంస్కృతిక వారసత్వం కూడా పరిరక్షించబడుతుందని ఎమ్మెల్యే పులివర్తి నాని ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆలయాల వివరాలు, వాటి అవసరాలను వివరిస్తూ సంబంధిత ప్రతిపాదన పత్రాలను ఆయన ఛైర్మన్‌కు సమర్పించారు. సానుకూల స్పందన: ఎమ్మెల్యే నాని విజ్ఞప్తిపై టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు గారు తక్షణమే సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలోని అన్ని ఆలయాలకు టీటీడీ తరఫున పూర్తి సహాయ సహకారాలు, ఆర్థిక సహాయం అందిస్తామని, ధార్మిక కార్...

డిసెంబర్‌ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఈ నెల 30న అఖిలపక్ష భేటీ

  ట్రూ టైమ్స్ ఇండియా: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధం సభ సజావుగా సాగేందుకు కేంద్రం కసరత్త ఓటర్ల జాబితా సవరణ అంశంపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు డిసెంబర్‌ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నవంబర్ 30వ తేదీన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో ప్రభుత్వం చర్చకు తీసుకురావాలనుకుంటున్న బిల్లులు, ఇతర ముఖ్యమైన అంశాలపై విపక్షాలకు వివరించి, వారి సహకారం కోరనుంది. డిసెంబర్ 1 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న ఈ శీతాకాల సమావేశాల్లో మొత్తం 15 సిట్టింగ్‌లు ఉంటాయి. అయితే, ఈసారి సమావేశాలు వాడీవేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశాన్ని సభలో బలంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుక...

ప్రతి విద్యార్థి బ్లడ్ శాంపిల్స్... ప్రతి హాస్టల్లో వాటర్ శాంపిల్స్ తీసుకోండి

అన్ని హాస్టళ్లల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా కౌన్సిలింగ్ ఇప్పించాలి సంక్షేమ శాఖలకు ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూం సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం, తాగునీటి వసతిపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు* అమరావతి, నవంబర్ 25: ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లల్లో తనిఖీలను మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు మొదలుకుని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు తమ విధి నిర్వహణలో భాగంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు... రెసిడెన్షియల్ స్కూళ్లల్లోని నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఇతర సదుపాయాలపై మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”సంక్షేమ శాఖ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం నూటికి నూరు శాతం నిర్వహించాలి. ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదు. ఇటీవల కాలంలో హాస్టళ్లల్లో జరిగిన తప్పిదాలు మళ్లీ రిపీట్ కాకూడదు. అలాంటివి పునరావృతమైతే... ఏం జరిగిందని తెలుసుకునేది ఉండదు... నేరుగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 20 శాతం హాస్టళ్లల్లో టాయిలెట్ల నిర్మ...