జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేస్తున్న ఉషశ్రీ చరణ్ు, సర్పంచులు – పెనుకొండ, శ్రీ సత్యసాయి జిల్లా. శ్రీ సత్యసాయి జిల్లా:పెనుకొండ నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీమతి ఉషశ్రీ చరణ్ సర్పంచుల బృందంతో కలిసి నేడు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మడకశిర సమన్వయకర్త ఈరలకప్ప గారు, నియోజకవర్గంలోని అనేక సర్పంచులు పాల్గొన్నారు. సర్పంచులు మాట్లాడుతూ – “మేము గ్రామాభివృద్ధి పనులకు స్వంతంగా ఖర్చు పెట్టి పనులు పూర్తి చేశాం. ఇప్పుడు నిధులు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వెంటనే మా నిధులను విడుదల చేయాలి” అని కోరారు. ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ – “అధికారంలో ఉన్న మంత్రి సవిత గారు, అధికారులను అడ్డం పెట్టుకుని పెనుకొండ నియోజకవర్గ సర్పంచుల నిధులను కావాలనే నిలిపివేశారు. ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి రాజకీయ కక్షతో వ్యవహరించడం సరికాదు. సర్పంచులు చేసిన అభివృద్ధి పనుల కోసం నిధు...