శ్రీ సత్యసాయి జిల్లా: ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నారాయణరెడ్డి అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్‌బీ (ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్), పీఎస్‌యూ (ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్) విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌లో డీఆర్వో, కలెక్టర్‌కు వారు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌బీ జిల్లా కార్యదర్శి పోతలయ్య, పీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర మాట్లాడుతూ. .. శ్రీ సత్యసాయి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కొన్నేళ్లుగా పాతుకుపోయిన నారాయణరెడ్డి భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధాన ఆరోపణలు: నాసిరకం చిక్కిల సరఫరా: నారాయణరెడ్డి స్వయంగా చిక్కిలు తయారుచేసే పరిశ్రమను ఏర్పాటు చేసి, దాని ద్వారా నాసిరకం చిక్కిలను తయారుచేస్తూ, పోషకాహారంలో నాసిరకం అందిస్తూ చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. నియామకాల్లో అక్రమాలు: వన్ స్టాఫ్ సెంటర్ నియామకాలలో నకిలీ ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్ల...
Local to international