ఇళ్లు నిర్మించుకోని వారికి పట్టాలు రద్దు అంశంపై చర్చ స్వంత స్థలము కలిగివుండి ప్రభుత్వం ద్వారా ఇళ్లు నిర్మించుకునే వారికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. దీనిపై తహసీల్దార్లు వేగంగా స్పందించి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆమె ఆదేశించారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల గృహ నిర్మాణ శాఖ పి.డిలు, ఈ.ఈలు డి.ఈలు, ఏ.ఈలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ వెరిఫికేషన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన– బి.ఎల్.సి. హౌసింగ్ కార్యక్రమం, ఎన్టీఆర్ హౌసింగ్ 2016 నుండి 2019 వరకు పెండింగ్ లో ఉన్న ఇళ్లను మొబైల్ యాప్ లో సర్వే చేయటం, 2021 నుంచి 2024 వరకు మంజూరై పూర్తైనవి, ఇంకా పనులు జరుగుతున్నవి.. అసలు ఇళ్లే నిర్మించుకోని వారు ఎంత మంది ఉన్నారు వంటి అంశాల గురించి చర్చించారు. ప్రస్తుతం హౌసింగ్ విభాగంలో సర్వే జరుగుతున్న విషయంపై ప్రధానంగా చర్చించారు. ఇందులో తహసీల్దార్ల నుంచి పొజిషన్ సర్టిఫికెట్ ఆలస్యమవుతోందని కొందరు అధికారులు చెప్పారు. ఈ సమస్యను రెవెన్యూ అధ...