Skip to main content

Posts

69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్: అనంతపురంలో సెపక్ తక్రా పోటీలు ప్రారంభం

ఉరవకొండ :69వ ఆంధ్ర రాష్ట్ర సెపక్ తక్రా పోటీలు అనంతపురం జిల్లాలో నేడు  ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (సెంట్రల్ హైస్కూల్) క్రీడా ప్రాంగణం ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, అనంతపురం జిల్లా ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ముఖ్య అతిథుల హాజరు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా సెపక్ తక్రా ఫెడరేషన్ ఉపాధ్యక్షులు జి. శ్రీనివాసులు హాజరయ్యారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పరిశీలకులు (కృష్ణా జిల్లా) రమేష్, మరో అతిథి విశాల్ (కృష్ణా జిల్లా) కూడా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన, జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం క్రీడాకారుల గౌరవ వందనాన్ని అతిథులు స్వీకరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి అతిథులు ప్రసంగించారు. రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు ఈ టోర్నమెంట్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన బాలబాలికలు 220 మంది పాల్గొన్నారు. పోటీల నిర్వహణ కోసం వివిధ జిల్లాల నుంచి 24 మంది మేనేజర్లు, కోచ్‌లు హాజరయ్యారు. అనంతపురం జిల్లా డీఈఓ ఆదేశాల మేరకు 30 మంది వ్యాయామ ఉపాధ్యాయులు డ్యూటీలో పాలుపంచుకుంటున్నారు. ఈ వివరాలను కార్య నిర్...

అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం: కమ్మ సామాజిక ఐక్యతకు కొత్త మైలురాయి

రాప్తాడులో ద్వితీయ కార్తీక వనభోజనం – 2025 అత్యంత వైభవంగా నిర్వహణ అనంతపురం (రాప్తాడు): కమ్మ సామాజిక వర్గం ఐక్యతను, గొప్పతనాన్ని ప్రతిబింబిస్తూ అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం (APKSS) ఆధ్వర్యంలో నిర్వహించిన ద్వితీయ కార్తీక వనభోజన మహోత్సవం – 2025 అత్యంత విజయవంతమైంది. అనంతపురం జిల్లా, రాప్తాడు మండలం, NH-44 పక్కన ఉన్న హంపాపురం గ్రామ సమీపంలో, ప్రముఖ వ్యాపారవేత్తలు దోనాదుల నాగశేషు అండ్ బ్రదర్స్ వ్యవసాయ క్షేత్రంలో నవంబర్ 2, 2025, ఆదివారం నాడు ఈ వేడుకను అశేష జనవాహిని మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కమ్మ సమాజ ఐక్యతకు మరొక కొత్త మైలురాయిగా నిలిచింది. ప్రముఖుల సమక్షంలో వనభోజనం ఈ మహోత్సవానికి రాజకీయ, ప్రభుత్వ రంగాల ప్రముఖులతో పాటు కమ్మ సామాజిక నేతలు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుపాటి వెంకట ప్రసాద్ మాట్లాడుతూ, కమ్మ సోదరులు వివిధ రంగాల్లో సాధిస్తున్న విజయాలు సమాజానికి గర్వకారణమని కొనియాడారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మీనారాయణ సామాజిక సమగ్రత, విద్యాభివృద్ధిలో కమ్మ సంఘాల పాత్రను అభినందించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారిలో:...

నకిలీ పత్రాల జారీపై కేసు నమోదు

సుండుపల్లె తహసిల్దార్ కార్యాలయ టైపిస్టు ప్రశాంత్ నాయక్ పై ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు SI శ్రీనివాసలు తెలిపారు.తహసిల్దార్ మహబూబ్ చాంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. ఇటీవల తమ దృష్టికి తేకుండా టైపిస్టు ప్రశాంత్ నాయక్ ఇంటి నివేశ అనుబంధ పత్రాలు జారీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా 27 మందికి నకిలీ ఇంటి నీవేశ అనుభవ పత్రాలు జారీ చేశారని చెప్పారు.

హౌసింగ్ ఉద్యోగులపై క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశాలు..

  ప్రొద్దుటూరు హౌసింగ్ ఉద్యోగులపై క్రిమినల్ కేసుల నమోదుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రొద్దుటూరు హౌసింగ్ కాలనీల్లో రూ.1,25,16,285ల విలువైన 13678.92MTల బల్క్ శాండ్ దుర్వినియోగమైనట్లు పలువురు ఆరోపించారు. AE వెంకటేశ్వర్లు, WI గుర్రప్ప, ఇందిర, కుమారిని బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు వివరాలు కోరుతూ.. DEE నుంచి ప్రొద్దుటూరు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు కడప జిల్లా లో రెండు రోజుల పర్యటన

ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు రెండు రోజుల వైయస్సార్ కడప జిల్లా పర్యటన లో భాగంగా శనివారం మ.1.25 గం.లకు కడప విమానాశ్రయమునకు చేరుకొన్నారు. కడప విమానాశ్రయం లో మాజీ ఉపరాష్ట్రపతి కి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్,యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ రాజశేఖర్, కడప ఆర్డీఓ జాన్ ఎర్విన్ స్వాగతం పలికారు... అనంతరం రోడ్డు మార్గాన ఆర్&బి అతిధి గృహం నకు చేరుకున్న మాజీ ఉప రాష్ట్రపతి కి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు, తదితరులు స్వాగతం పలికారు.  మాజీ ఉపరాష్ట్రపతి వారికి శ్రీశైలం దేవస్థానం ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు,వై ఎస్ ఆర్ కడప జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి,రాష్ట్ర జనరల్ సెక్రటరీ రమేష్ నాయుడు, సీనియర్ నాయకులు శశి భూషణ్ రెడ్డి,భారవి, శ్రీనివాసులు,కృష్ణా రెడ్డి, పలువురు బిజెపి నాయకులు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు.

అనంతపురం జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీపు యాత్ర

ఎస్కేయూ, జేఎన్టీయూ, సెంట్రల్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి. ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా భవనాలు ఏర్పాటు చేయాలి.  వజ్రకరూర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి.  డిగ్రీలో తీసుకొచ్చిన హానర్స్ డిగ్రీ ,మేజర్ - మైనర్ సబ్జెక్ట్ విధానాన్ని రద్దు చేయాలి. పెండింగ్ లో ఉన్న 6,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. నవంబర్ 3 తేదీ నుండి 7 తేదీ వరకు అనంతపురం జిల్లా విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీపు యాత్ర ప్రారంభించడమైనది దీనికి సంబంధించినటువంటి కరపత్రాలు ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి S.M.హరూన్ రషీద్ విడుదల చేశారు వారు మాట్లాడుతూ..... ఈ జీపు యాత్రకు విద్యార్థులు, యువత, మేధావులు కలిసి జయప్రదం చేయాలని అలాగే SK యూనివర్సిటీ,JNTU , సెంట్రల్ యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి అలాగే ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కావున వజ్రకరూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి అలాగే ఉరవకొండ లో ఉన్నటువంటి ...

కళ్యాణ్ దుర్గం వైసీపీ కార్యకర్తల్లో గందరగోళం

త్రిమూర్తుల మధ్యలో నలిగిపోతున్న క్యాడర్ – అధిష్టానం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. ఒకరికి మద్దతు ఇస్తే మరొకరికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడడంతో కార్యకర్తలు తికమకపాటుకు గురవుతున్నారు. ఎవరికి చివరికి టికెట్ దక్కుతుందో స్పష్టత లేక పార్టీ క్యాడర్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. త్రిమూర్తుల మధ్య కొనసాగుతున్న ఈ రాజకీయ యుద్ధం పార్టీ బలాన్ని దెబ్బతీసేలా మారిందని స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో మాజీ మంత్రి ఉషా గారికి మద్దతుగా పనిచేసిన కొందరు నాయకులు, ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జ్ నుంచి దూరమవుతున్నట్టుగా సమాచారం. ఎవరికి నచ్చినట్టుగా వ్యవహారాలు సాగిపోవడం వల్ల వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో త్రిమూర్తులలో ఎవరికి అదృష్టం వరిస్తుందో, ఎవరికి అధిష్టానం మోక్షం కలిగిస్తుందో వేచి చూడాల్సిందేనని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.