Skip to main content

Posts

విద్యా లక్ష్మీగా ఉద్భవ లక్ష్మీ

  ఉరవకొండ  సెప్టెంబర్ 29: అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని,ఆదివారం మహా లక్ష్మీ రూపంలో భక్తుల కు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు   సెప్టెంబర్ 22, సోమవారం: ఆదిలక్ష్మి  సెప్టెంబర్ 23, మంగళవారం: గజలక్ష్మి  సెప్టెంబర్ 24, బుధవారం: ధాన్యలక్ష్మి  సెప్టెంబర్ 25, గురువారం: సౌభాగ్యలక్ష్మి  సెప్టెంబర్ 26, శుక్రవారం: ధనలక్ష్మి  సెప్టెంబర్ 27, శనివారం: సంతానలక్ష్మి  * సెప్టెంబర్ 28, ఆదివారం: మహాలక్ష్మి రూపాల్లో దర్శనం ఇచ్చారు. కాగా సోమవారం  ఉదయం దేవస్థానం లో అమ్మవారు విద్యా లక్ష్మీ గా భక్తులు పూజలు నిర్వహించారు.సుప్రభాత సేవ, పసుపు, కుంకుమార్చనలు చేశారు. పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి భక్తులు పూజలు నిర్వహించారు. చూడముచ్చటగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.   సోమవారం విద్యాలక్ష్మిగా భక్తుల నీరాజనాల అందుకుంటారని దేవస్థాన పూజారులు ద్వారకనాథ ఆచార్యులు, మయూరం బాలాజీలు తెలిపారు.

బీజేపీ గిరిజన మోర్చా జోనల్ సమావేశం: తిరుపతిలో గిరిజన నేతల భేటీ

 తిరుపతి: తిరుపతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గిరిజన మోర్చా రాష్ట్ర నాయకత్వం తిరుపతిలో జోనల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుండి గిరిజన మోర్చా ముఖ్య సభ్యులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పొంగి రాజా రావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. గిరిజన మోర్చా కార్యకలాపాలు, పార్టీ పటిష్టత, రాబోయే ఎన్నికల్లో గిరిజన ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడం వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:  * పొంగి రాజా రా  (గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు)  * మూడ్ కేశవ నాయక్  (బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు)  * సుగాలి గోపాల్ నాయక్  (రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్)  * శివా నాయక్   * నారాయణ   * తదితర బీజేపీ గిరిజన మోర్చా కుటుంబ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు పొంగి రాజా  మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గిరిజనులలోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడంపై దృష్టి సారించాలని మోర్చా సభ్యు...

రేబిస్ మహమ్మారి పై ఆందోళన

 ప్రపంచవ్యాప్తంగా రేబిస్ వ్యాధి ప్రాణాలు బలితీస్తూనే ఉంది. డబ్ల్యూహెచ్‌వో తాజా నివేదిక ప్రకారం, ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకరు రేబిస్ వల్ల మృతి చెందుతున్నారు. ఇందులో మూడవ వంతు మరణాలు భారతదేశంలోనే సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో భారతదేశంలోనే 284 మంది రేబిస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కోట్ల సంఖ్యలో వీధి కుక్కలు ఉండటం ఈ దుస్థితికి ప్రధాన కారణమని పార్లమెంట్‌కు సమర్పించిన ఐడీఎస్‌పీ (ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్) నివేదిక స్పష్టం చేసింది. పలు దేశాలు ఇప్పటికే 70% వాక్సినేషన్ లక్ష్యం సాధించి రేబిస్ నియంత్రణలో విజయవంతమయ్యాయి. అదే విధంగా భారత్ కూడా ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రేబిస్ నివారణకు వెంటనే వాక్సినేషన్ కార్యక్రమాలు చేపట్టడం, ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం అత్యవసరం అని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.

మరో అల్పపీడనం.. రాష్ట్రంలో వర్షాల సూచన.

  అమరావతి : బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. రేపటినాటికి అక్కడ ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, అది బుధవారానికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఉత్తరాంధ్ర, నంద్యాల జిల్లాల్లో ఇప్పటికే వర్షం పరిస్థితులు ఏర్పడుతున్నాయని, నేడు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ⚠️ అధికారులు ప్రజలు వర్షాలు, గాలులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రిజిస్టర్ పోస్టు విలీనం – తపాలా శాఖలో కొత్త మార్పులు

  న్యూఢిల్లీ: దేశ తపాలా సేవల్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న రిజిస్టర్ పోస్టు విధానంను తపాలా శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేసింది. ఇకపై రిజిస్టర్ పోస్టు ఒక విలువ ఆధారిత సేవగా స్పీడ్ పోస్టు కింద అందుబాటులోకి రానుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఏకీకృత టారిఫ్ అమలులోకి వస్తోంది. అదనంగా కొత్తగా ఓటీపీ ఆధారిత డెలివరీ సేవను ప్రవేశపెట్టింది. ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిన ఉత్తరాలను చిరునామాదారుకే పోస్టుమన్ అందజేయాలి. ఇందుకోసం సంతకం తప్పనిసరి. ఈ సేవను వినియోగించుకోవడానికి నిర్దేశిత టారిఫ్‌పై ప్రతి ఆర్టికల్‌కు రూ.5 అదనంగా (జీఎస్టీ మినహాయించి) వసూలు చేయనున్నారు. ఇక స్పీడ్ పోస్టుకు సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టిన ఓటీపీ ఆధారిత డెలివరీ సేవలో, ఉత్తరం పంపిణీ సమయంలో చిరునామాదారుని మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ధృవీకరించిన తర్వాతే పోస్టుమన్ ఉత్తరాన్ని అందజేస్తాడు. ఈ సేవకూ నిర్దేశిత టారిఫ్‌పై రూ.5 అదనంగా చెల్లించాలి. విద్యార్థులకు ఉపశమనం స్పీడ్ పోస్టు చార్జీలను విద్యార్థులకు 10 శాతం...

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.        బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి, “ఆడబిడ్డలను మన సంతోషాల్లో భాగస్వాములను చేసినప్పుడే ఈ పండుగ నిండుదనం సంతరించుకుంటుంది” అని పేర్కొన్నారు. బతుకమ్మ కుంట కోసం జీవితాంతం పోరాడిన వి. హనుమంతరావును స్మరించుతూ ఆయనకు గౌరవప్రదమైన నివాళులు అర్పించారు. హైడ్రా ఏర్పాటు సమయంలో ఎదురైన వివాదాలు, విమర్శలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి, “ఒడిదుడుకులు వచ్చినపుడు సమయస్ఫూర్తితో పరిష్కారాలు కనుగొంటూ ముందుకు సాగాలి” అని అన్నారు. కోవిడ్‌ తరువాత వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రస్తుతం కుంభవృష్టి వర్షాలు ఒకేసారి కురుస్తున్నాయని తెలిపారు. “మన వ్యవస్థ కేవలం రెండు సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునేలా ఉన్నప్పటికీ, ఇప్పుడు విపరీత వర్షాలను ఎదుర్కొనేలా పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల ప్రణాళికలు సిద్ధం చేశాం” అని ముఖ్యమంత్రి వివరించారు. మూసీ పునరుజ్జీవనమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి...

ఏపీఐఐసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ ని ఘనంగా సన్మానించిన పూతలపట్టు జనసేన నాయకులు.

పూతలపట్టు సెప్టెంబర్ : ఏపీఐఐసీ డైరెక్టర్గా నియమితులైన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మై ఫోర్స్ మహేష్ గాని మదనపల్లి కేంద్రంలో ఉన్న ఎంజి గ్రాండ్ నందు పూతలపట్టు జనసేన నాయకులు ఘనంగా సన్మానించారు. ఎం మహేష్ స్వేరో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా జనసేన పార్టీకి నిస్వార్ధంగా సేవ చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మై పోస్ట్ మహేష్ గారిని ఏపీఐఐసీ డైరెక్టర్గా నియమించడం శుభసూచకమని భవిష్యత్తులో ఉమ్మడి చిత్తూరు జిల్లా, పరిసర జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి మహేష్ గారు రెట్టింపు స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి,అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని,ఇలాంటి యువ నాయకుడికి అవకాశం కల్పించడం హర్షణీయం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య,జిల్లా నాయకులు ఎం మహేష్ స్వేరో,యాదమరి మండల అధ్యక్షులు కుమార్,యాదమరి మండల కార్యదర్శి వేముల పవన్,తవణంపల్లి మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు చిన్న,అజిత్ శ్రీరాముల,అనిల్ కుమార్,ప్రభాకర్,టీ ఎన్ ఎస్ ప్రసాద్,త్రినాథ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.