Skip to main content

Posts

కర్నూలు బస్సు ప్రమాదం: రాష్ట్ర హోం, రవాణా మంత్రులతో టీడీపీ నేతల భేటీ

   కర్నూలు: కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో, రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిలు ఈరోజు కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్‌లో విపత్తు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రమాద సంఘటనపై మరియు ఇతర కీలక అంశాలపై చర్చించారు. ఈ చర్చలో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నాగేశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు, దర్యాప్తు పురోగతి, మరియు బాధితులకు ప్రభుత్వం అందించే సహాయం తదితర విషయాలపై మంత్రులతో టీడీపీ నేతలు మాట్లాడినట్లు సమాచారం.

శబరిమల గోల్డ్ స్కామ్లో కీలక ట్విస్టు

  దేశవ్యాప్తంగా పెను సంచలనం  శబరిమల ఆలయ బంగారం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగారం తాపడాల నుంచి వేరు చేసిన పసిడిని కర్ణాటకలోని ఓ వ్యాపారి విక్రయించినట్లు ఈ కేసులో ప్రధాన నిందితుడి ఉన్నికృష్ణన్ అంగీకారించాడు. విచారణలో నిందితుడు పూర్తి వివరాలు వెల్లడించినట్లు సిట్ అధికారలు తెలిపారు. బంగారు తాపడాలను మరమ్మతుల కోసం తీసుకెళ్లగా.. తరువాత చోరీకి గురయ్యాయి.

మార్కాపురంలోకి శ్రీశైలం..?

 ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. ప్రతిపాదిత మార్కాపురం జిల్లాలో శ్రీశైలాన్ని కలిపేలా అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపినట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లా కేంద్రానికి శ్రీశైలం దూరంగా ఉండటంతో స్థానికుల నుంచి వినతులు వచ్చినట్లు సమాచారం. మార్కాపురానికి శ్రీశైలం 80 కి.మీ. దూరంలో ఉండగా, నంద్యాల-శ్రీశైలం మధ్య 165 కి.మీ దూరం ఉంది. మరోవైపు అద్దంకిని బాపట్ల జిల్లా నుంచి తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనలూ ఉన్నట్లు సమాచారం...!!

ప్రయాణికులందరికీ ఇన్సూరెన్స్ ఉంది. కావేరి ట్రావెల్స్ యాజమాన్యం

బెంగుళూరు: కర్నూలు లో జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాదంపై ఎట్టకేలకు యాజమాన్యం స్పందించింది. తమ బస్సుకు అన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్లు వ్యాలిడ్లోనే ఉన్నాయని ఆ సంస్థ యజమాని వేమూరి వెంకటేశ్వర్లు పేరుమీద ఓ ప్రకటన విడుదల చేసింది. బస్సులో 40 మంది ప్రయాణికులున్నారని, తమ ఏజెన్సీ తరఫున ప్రయాణికులందరికీ ఇన్సూరెన్స్ కూడా ఉందని స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.

తోక తొక్కితే తోటి వాడు అనుకో

ఘనంగా నాగుల చవితివేడుకలు ఆశ్లేష, ఆరుద్ర, మూల,పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ. అనగా ‘నాగం’ సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు. కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది. కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణము కూడా సర్పమే. కావున నాగులను ఆరాధిం...

ఆదారాలతో సహా మెము విద్యుత్ అవినీతిపై చూపించాము..

 తిరుపతి..  ఎబి వెంకటేశ్వర రావు,,మాజీ డిజి.. ఇది ట్రయిలర్ మాత్రమే.. పకడ్బందీగా అవినీతి సామ్రాజ్యం నిర్మించారు... రెండు ప్రభుత్వాల ప్రేమకథ. ఇందులో హీరోయిన్ ఒకరే..హీరోలు మాత్రము ఇద్దరు.. మాకు వ్యక్తిగతంగా ఎవ్వరి మీదా లేదు.. ఈ దందా వల్ల పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోతారు.. షిర్డిసాయి కాకపోతే మరో కంపెనీని తెచ్చుకుంటారు.. నేనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని చెప్పిన వారు ఎందుకు అవినితి గురించి మాట్లాడారు.. 27సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాయిలాల వల్ల సంస్కరణలు వచ్చాయి.. మనకంటే ముందుగా హర్యానా లాంటి రాష్టాలు సంస్కరణలు వచ్చాయి.. కేంద్రము చాక్ కెట్ అశ చూపించి విద్యుత్ బోర్డులు రద్దు చేసి జనరేషన్,డిస్టిబ్యూషన్ పేరుతో విడదీసి కార్పొరేషన్ పేరుతో కమర్షియల్ గా మార్చారు.. పాతిక సంవత్సరాల తర్వాత నష్టం తప్ప లాభము లేదు.. ప్రభుత్వ జవాబు దారీ తనము లేకుండా చేసారు.. ఈఅర్ సి పేరుతో రిటైర్డ్ జడ్జీని తెచ్చి పెట్టారు‌.. ఈ అర్ సి వల్ల ఎవ్వరికి న్యాయము.. ఈ అర్ సి అనేది డిస్టిబ్యూషన్ సంస్థల తప్పులకు వత్తాసు పలుకుతుంది.. గత రెండు సంవత్సరాలుగా అవినీతి ప్రేమకథ క్లైమాక్స్ నడుస్తుంది.. ఈ ...

రోడ్డు భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అనంతపురం  : జిల్లాలో రోడ్డు భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ తో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగ్ స్థలాలను గుర్తించాలని, నగరపాలక సంస్థ, ట్రాఫిక్ అధికారులు జాయింట్ తనిఖీ చేసి ప్రైవేట్ భూములను కూడా గుర్తించాలన్నారు. గుత్తి - గుంతకల్లు రోడ్ లోని రోడ్ మరియు ఆర్ఓబిని, రాప్తాడు వద్ద రైల్వేలైన్ ఉన్న బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బస్సులను ఆపేందుకు గుర్తించిన స్థలాల్లోనే మార్కింగ్ వేసి అక్కడే బస్సులు నిలిపేలా మున్సిపల్ కమిషనర్ తో సమన్వయం చేసుకొని ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్ఐసి వారు అభివృద్ధి చేసిన ఐరాడ్ యాప్ లో సిహెచ్సి మరియు ఏరియా ఆస...