Skip to main content

Posts

బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలికి అపూర్వ సన్మానం: తిరుపతిలో ఘనంగా అభినందన సభ:దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్:

   భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర మహిళా మోర్చా నూతన అధ్యక్షురాలిగా శ్రీమతి నిషిద రాజు నియమితులైన సందర్భంగా, ఆమెకు అభినందనలు తెలిపేందుకు తిరుపతిలోని శ్రీ బాలాజీ కళ్యాణ మండపంలో 12-11-2025 తేదీన ఆత్మీయ సభను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వేలాది మంది మహిళా కార్యకర్తలు ఈ సభకు భారీగా తరలివచ్చారు.  ముఖ్య అతిథులుగా రాష్ట్ర, కేంద్ర నాయకులు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు హాజరై శ్రీమతి నిషిద రాజు కి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ , కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజా శ్రీనివాస వర్మ , శ్రీ సోమువీర్రాజు , శ్రీ పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. మహిళా మోర్చా నాయకులలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి బొల్లిన నిర్మల , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి సాలగ్రామం లక్ష్మీ ప్రసన్న , శ్రీమతి ముళ్ళపూడి రేణుక శ్రీమతి గీత కూడా సభకు హాజరై నూతన అధ్యక్షురాలికి అభినందనలు తెలిపారు.  మహిళా రిజర్వేషన్లు, సంస్థాగత ఎన్నికలపై ప్రసంగం ఈ సందర్భంగా, మహిళా నాయకులు మాట్లాడుతూ... చట్టసభల్లో మహిళలకు 33% రి...

మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు – వెండి కూడా ఎగబాకింది.

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,290 పెరిగి రూ.1,27,800కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,100 పెరిగి రూ.1,17,150కు చేరింది. బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా పెద్ద ఎత్తున పెరుగుదల నమోదైంది. కిలో వెండి ధర రూ.9,000 పెరిగి రూ.1,82,000కు చేరింది. ఈ ధరల పెరుగుదలతో ఆభరణాల కొనుగోలు దారులు తాత్కాలికంగా వెనుకడుగు వేస్తుండగా, పెట్టుబడిదారులు మాత్రం బంగారంపై దృష్టి సారిస్తున్నారు.

ట్రంప్‌ సంతకంతో అమెరికాలో ముగిసిన చారిత్రాత్మక షట్‌డౌన్‌

అమెరికా చరిత్రలో అత్యంత కాలం కొనసాగిన ఆర్థిక షట్‌డౌన్‌కు చివరపడింది. ప్రభుత్వ ఫండింగ్‌ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం రాత్రి సంతకం చేయడంతో 43 రోజులుగా కొనసాగిన షట్‌డౌన్‌ అధికారికంగా ముగిసింది. ఈ బిల్లు అంతకుముందు ప్రతినిధుల సభలో 222-209 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఫలితంగా ప్రభుత్వ విభాగాలు, సంస్థలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. దీర్ఘకాలంగా జీతాలు నిలిచిపోయిన సర్కారీ ఉద్యోగులకు ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది. విశ్లేషకులు ఈ నిర్ణయాన్ని అమెరికా ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్‌ సంకేతంగా పేర్కొంటున్నారు. 

అనంతపురం రాంనగర్ హెచ్డీఎఫ్‌సీ బ్యాంకులో బంగారం మాయం కలకలం

  అనంతపురం రాంనగర్‌లోని హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పెద్ద ఎత్తున బంగారం మాయం ఘటన చోటు చేసుకుంది. మొత్తం 37 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు 2 కిలోల బంగారం అదృశ్యమైనట్లు సమాచారం. బ్యాంకులో పనిచేసే ఒక ఉద్యోగి ఈ బంగారాన్ని అక్రమంగా కాజేసి, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వద్ద తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు బుధవారం బ్యాంకు ముందు ధర్నా చేపట్టారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రజల సొమ్మును రక్షించాల్సిన బ్యాంక్‌లోనే ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

లక్ష్యం మేరకే అనుకున్న టైంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం – రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు , మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి , గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి , ఎర్రగొండపాలెం టిడిపి ఇన్‌చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు కలిసి ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. మంత్రివర్యులు దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ , జంట సొరంగాల డివాటరింగ్ పనులు , అలాగే ప్రాజెక్టు వద్ద జరుగుతున్న ఇతర నిర్మాణ కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులు , కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ – “వెలిగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం. మార్కాపురం జిల్లాను త్వరిగా ప్రకటిస్తాం. మెడికల్ కాలేజీని కూడా పీపీపీ మోడ్‌లో పూర్తి చేస్తాం. కానీ వైసీపీ నాయకులకు పనీపాట లేక రోడ్లపై కోటి సంతకాల సేకరణ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు,” అని అన్నారు. జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు – ముఖ్యాంశాలు: వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. మొంథా తుఫాన్ కారణంగా ...

ఈ నెల సదరం ధ్రువీకరణ పత్రాలకు స్లాట్ బుకింగ్ ప్రారంభం

రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతుల కోసం వైకల్య నిర్ధారణ (సదరం) ధ్రువీకరణ పత్రాల స్లాట్ బుకింగ్ ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమవుతుందని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రదర్ ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025 నెలల కోసం సదరం ధ్రువీకరణ పత్రాల స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ప్రజలు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డ్ సచివాలయం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో శారీరక, మానసిక, బధిరులు, దృష్టి వైకల్యం ఉన్నవారికి, ఎరియా ఆసుపత్రుల్లో శారీరక మరియు దృష్టి వైకల్యం ఉన్నవారికి, మరియు సి.హెచ్.సి. (CHC) లలో శారీరక వైకల్యం ఉన్నవారికి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయబడతాయని ఆయన వివరించారు. వైకల్య ధ్రువీకరణ కోసం తగిన పత్రాలతో సదరం స్లాట్ బుక్ చేసుకోవాలని, తద్వారా సులభంగా ధ్రువీకరణ పొందవచ్చని చక్రదర్ ఐఏఎస్ సూచించారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాయదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ

రాయదుర్గం:  ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, నియోజకవర్గ సమన్వయకర్త గౌ. శ్రీ మెట్టు గోవిందరెడ్డి గారి సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ & యువ నాయకుడు శ్రీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి గారు తహసీల్దార్‌ (MRO) గారికి వినతిపత్రం సమర్పించారు. యువ నాయకుడు వ్యాఖ్యలు: “ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచే బదులు, PPP (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పేరుతో 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే నిర్ణయం తీసుకోవడం తీవ్రంగా ఖండనీయమైనది. దేశంలో ఎక్కడా ఇలాంటి పద్ధతి అమలు చేయబడడం లేదు. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రజా వ్యతిరేకతతో ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకున్నాయి,” అన్నారు. “ఒక ప్రాంతంలో మెడికల్ కాలేజీ స్థాపన వల్ల మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ నిపుణులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులోకి వస్తారు. ప్రభుత్వం ప్రతి ఏ...